ఆకేరు న్యూస్, తాడ్వాయి: మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనుసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరావుల చిత్రపటాలకు మంగళవారం రైతులు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండల కమిటీ అధ్యక్షుడు బోల్లు దేవేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ,ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తూచ తప్పకుండా పాటిస్తుందని దీమా వ్యక్తం చేశారు .ఇందులో భాగంగానే రైతులకు పూర్తిస్థాయిలో రైతు భరోసా అందజేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో మేడారం జాతర చైర్మన్ ఆరెం లచ్చు పటేల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి నాయకులు ఇరప సునీల్ జైపాల్ రెడ్డి జగదీష్ పీరీల వెంకన్న లో తో పాటు వివిధ గ్రామాల రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
