ఆకేరు న్యూస్, తాడ్వాయిః తాడ్వాయి మండల రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి కి పాల్పడడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు బోర్లు దేవేందర్ ముదిరాజ్ అన్నారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పాత్రికేయుల పై తమకు చాలా గౌరవం ఉన్నదనా్నరుశ్రీకాంత్ రెడ్డి పై దాడికి కాంగ్రెస్ పార్టీ కి ఎలాంటి సంబంధం లేదన్నారు.దాడికి గల కారణాలు వారి వారి వ్యక్తిగత విషయాలన్నారు. ఏది ఏమైనప్పటికీ రిపోర్టర్ పై దాడి చేయడం దురదృష్టకరమన్నారు.దినిపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్లి విచారణ జరిపిసా్తమన్నారు. పార్టీకి సంబంధించి దాడి జరిగిందని తెలిస్తే కచ్చితంగా పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. దీని పై పూర్తి విచారణ జరపాలని ఆయన పోలీసులను కోరారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
