* రూ.446.13 కోట్లతో నిర్మాణం
* రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గచ్చిబౌలి ఔటర్ రింగ్‌రోడ్డు జంక్షన్ నుంచి శిల్ప లేఔట్ స్టేజ్-2 కొండాపూర్ వైపు రూ.446.13 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఆరు లైన్ల ఫ్లైఓవర్(FLY OVER)ను శనివారం మధ్యాహ్నం సీఎం రేవంత్‌రెడ్డి (REVANTH REDDY)ప్రారంభించనున్నారు. ఈమేరకు స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఫ్లైఓవర్‌ను ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, జోనల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ (GANDHI)మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్‌కు పీజేఆర్ పేరు పెట్టడం గొప్ప విషయమని, సీఎంకు రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే, ప్రజలకు సాంత్వన కలుగుతుందని, ట్రాఫిక్ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని అభిలాషించారు. ఐటీహబ్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ వంటి ఐటీ ప్రాంతాలకు రాకపోకలు సులభం అవుతాయని వెల్లడించారు. వాహనాల ఇంధనం కూడా ఆదా అవుతుందన్నారు. ఔటర్ రింగ్‌రోడ్‌కు కనెక్టివిటీ మెరుగు అవుతుందన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా శిల్పా లేఔట్ స్టేజ్-2లో భాగంగా కొండాపూర్ (KONDAPUR) వైపు ఫ్లైఓవర్ నిర్మించినట్లు తెలిపారు. పొడవు 816 మీటర్లు, వెడల్పు 24 మీటర్లతో ఫ్లైఓవర్ నిర్మించారని వివరించారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
