* ఎకరం భూమి రూ.104.74 కోట్లు!
* 66 ఎకరాల విక్రయానికి సర్కారు సన్నాహాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివారులోని భూముల వేలానికి సన్నాహాలు చేస్తోంది. నగర శివారులోని 66 ఎకరాలను జీటీఐఐసీతో విక్రయించడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉస్మాన్‌సాగర్‌లో 46 ఎకరాలు, 13 ప్లాట్లు, రాయదుర్గంలో 4 ప్లాట్లు వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. రాయదుర్గంలో 7.67 ఎకరాల భూమికి వేలం వేయనుంది. టీజీఐఐసీ ఎకరం భూమి ధర రూ.104.74 కోట్లుగా నిర్ధారించింది. అలాగే రాయదుర్గంలోని 15A/2 ప్లాట్‌కు మార్కెట్ ధర రూ.71.60 కోట్లుగా నిర్ణయించింది. టెండర్ దాఖలుకు ఆగస్టు 8వ తేదీ వరకు గడువు ఇచ్చింది. టీజీఐఐసీలో టెక్నికల్ ప్రజెంటేషన్‌తో ఆగస్టు 12వ తేదిన టెండర్ అవార్డు చేయనుంది.
………………………………………………….
