* నీటిని విడుదల చేసిన మంత్రులు
* 18 ఏళ్ల తర్వాత జూలైలోనే నిండిన జలాశయం
ఆకేరు న్యూస్, నాగార్జునసాగర్ : నాగార్జున సారగ్ నుంచి క్రస్ట్ గేట్లు ఎత్తి మంత్రులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఉత్తమ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నీటిని దిగువకు వదిలారు. 18 ఏళ్ల తర్వాత జూలైలోనే నాగార్జున సాగర్ నిండింది. నెల ముందుగానే సాగర్ నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వానలకు జలాశయం నిండుకుండలా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న నాగార్జునసాగర్ జలాశయం క్రస్ట్ గేట్లు నేడు తెరుచుకున్నాయి. కృష్ణమ్మకి పూజలు చేసి మంత్రులు నీటిని వదిలారు. సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గేట్లు ఎత్తనుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, నాగార్జునసాగర్ నిండుకుండలా మారడంతో జలకళ సంతరించుకుంది.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
