* కేంద్ర మంత్రికి ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి
*ఎంపీతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు
ఆకేరున్యూస్,డెస్క్ : వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీ కడియం కావ్య ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు,గండ్ర సత్యనారాయణ,ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యలు కేంద్ర పౌరవిమాన యాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మామునూరు ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కు ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, పెద్ద విమానాల రాకపోకలకు వీలు కల్పించేలా అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరగా పూర్తి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర మంత్రిని కోరారు.ఎయిర్ పోర్టు భూసేకరణ కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.205 కోట్ల నిధులు మంజూరు చేసిందని స్పష్టం చేశారు. ఆ భూమిని విమానాశ్రయ విస్తరణ కోసం ఉచితంగా అందజేస్తుందని ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య తెలియజేశారు. మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధితో వరంగల్ ప్రజలకు మెరుగైన విమాన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, పర్యాటకం, వ్యాపారంతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించారు. రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పన భూసేకరణ అనంతరం విమాన రాకపోకలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ వెల్లడించారు.

…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
