Station Ghanpur Vinayaka Navaratri Celebrations
* నవరాత్రి ఉత్సవాల్లో కౌన్సిలర్ కు సత్కారం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో శ్రీ చక్ర నగర్ కాలనీలో శ్రీ చక్ర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా మూడవరోజు లంబోదరుడిని పబ్బా రాజు-మాధవి దంపతులు లక్ష పోగుల యజ్ఞోపవీతం, లక్ష ఉండ్రాళ్లతో అభిషేకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మున్సిపాలిటీ 18 వ వార్డు కౌన్సిలర్ పొన్న రవి హాజరు కాగా సొసైటీ సభ్యులు అతన్ని సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు తోటకూరి బిక్షపతి ఉపాధ్యక్షులు, వేల్పుల పున్నా రెడ్డి, సభ్యులు గట్టు రవి, వంచ చంద్రశేఖర్ రెడ్డి, ఎదునూరి శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి రాజు, సభ్యులు కల్మెకోలన్ వెంకటరెడ్డి, కోట వెంకటేశ్వర్లు, కుమారస్వామి, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పబ్బా రాజు మాధవి దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
