* సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ లోని బీజేపీ నాయకులు, బీఆర్ ఎస్ నాయకులు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణకు కేంద్రం యూరియా ఎందుకు సరఫరా చేయడంలేదో నిలదీయాలని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. ఎక్స్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపే బీఆర్ఎస్ పార్టీ వాళ్లు… ఢిల్లీలో మోదీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారని రేవంత్ ప్రశ్నించారు. మోదీ అంటే భయమా.. భక్తా..అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో.. గొంతు కలిపి పార్లమెంట్లో తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన ఎంపీ ప్రియాంక గాంధీకి సీఎం ఎక్స్ వేదికగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మోదీకి మొదటి నుంచి తెలంగాణపై వివక్షత భావం ఉందని అన్నారు. తెలంగాణకు కేంద్రం యూరియా సరఫరా చేయకుండా ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారన్నారు. రాష్ట్ర రైతాంగ అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని లేఖల రూపంలో, విజ్ఞప్తుల రూపంలో కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్త చేశారు. రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మోదీ భజనలో బిజీగా ఉన్నారని విమర్శించారు. మన రైతుల కోసం.. మోదీ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు… మాతో కలిసి రావాల్సిన.. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పత్తా లేరని ఎద్దేవా చేశారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
