ఏపీలో ఇద్దరు డీఎస్సీల పై ఈసీ వేటు
* సీఈసీ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ
ఆకేరు న్యూస్, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు డీఎస్సీలపై బదిలీ వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విపక్షాల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఎన్నికల కమిషన్ ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేయాలని డీజీపీని ఆదేశించింది. ఈమేరకు అనంతరపురం టౌన్ రాయచోటి డీఎస్సీ మహబూబ్భాషాలను డీజీపీ బదిలీ చేశారు. అధికారపార్టీ నేతలకు ఒత్తాసుపలుకుతూ టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని వీరరాఘవరెడ్డిపై టీడీపీ ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. ఆయనతో పాటు రాయచోటి డీఎస్సీని కూడా బదిలీ చేశారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని ఇద్దరినీ డీజీపీ ఆదేశించారు.
——————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
