ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసినందుకు సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తొమ్మిది రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.తొమ్మిది రోజులపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్లు, భక్తులు అందరికీ అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
……………………………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
