* అధికారులు సత్వరమే స్పందించాలి
* కలెక్టర్ హరిచందన దాసరి ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు అందించే వినతిపత్రాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఇళ్లు కావాలని 329, రెవెన్యూశాఖకు 57, ఇతర శాఖలకు 28 మంది ఆర్జీలతో తమ సమస్యలను తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తమ విభాగాలకు వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులు, వయోవృద్థుల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబరుకు వచ్చే వినతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, ఆర్డీఓలు రామకృష్ణ, సాయిరాం, గృహనిర్మాణ శాఖ పీడీ అశోక్చక్రవర్తి, సీపీఓ సురేందర్, లా ఆఫీసర్ శ్రీధర్, డీఎంహెచ్ఓ వెంకటి, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ర్టేట్ జ్యోతి, డిఈఓ రోహిణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు కోటాజీ, ఇలియాస్అహ్మద్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
