* రెండేళ్లు అవుతున్నా ఫోన్ ట్యాపింగ్ కేసుకు ముగింపు లేదు
* విచారణలో కేసీఆర్ నిజాలు చెబుతారని ఆశిస్తున్నా
* సిట్ విచారణను తప్పుబట్టడం సరికాదు
* తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సిట్ విచారణలో ఏం జరిగిందో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతారని అనుకుంటున్నా అని తెలంగా జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రెండేళ్లు అవుతున్నా ఫోన్ ట్యాపింగ్ కేసు ముగింపు రావట్లేదు అని, అందుకు గల కారణాలు ఏంటో సర్కారే చెప్పాలని వెల్లడించారు. విచారణకు త్వరగా ముగింపు పలకాలని, దోషులకు శిక్ష పడాలని కవిత ఆకాంక్షించారు. సిట్ విచారణను తప్పుబడుతూ బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం సరికాదని హితవు పలికారు. చట్టాలను అందరూ గౌరవించాలని, అధికారులకు సహకరించాలని సూచించారు. గుంటనక్కలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పిలిస్తే వెళ్తానని తెలిపారు. తన ఫోన్, తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని అనుమానాలు ఉన్నాయని కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ సోదరి కవిత వెల్లడించారు. సిట్ అధికారులు పిలిస్తే వెళ్లి విచారణకు సహకరిస్తానని ఆమె స్పష్టం చేశారు.
………………………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
