* మెమోల ఆశ చూపి రూ. 85 లక్షలతో ఉడాయింపు
ఆకేరు న్యూస్, డెస్క్: ఉత్తరప్రదేశ్లోని దేవరియా జిల్లాలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా వారణాసిలో పూజారిగా పనిచేస్తున్న విమలేష్ మిశ్రా కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడికి మెమోలు అంటే అమితమైన ఇష్టం. ఇదే ఆ బాలుడి బలహీనతగా మార్చుకున్నారు ముగ్గురు వీధి వ్యాపారులు.సదరు వ్యాపారులు ఆ బాలుడిని తమ మాయమాటలతో నమ్మించారు. “ఇంటి నుంచి బంగారం తెచ్చి ఇస్తే, నీకు ఎన్ని మెమోలు కావాలంటే అన్ని ఉచితంగా ఇస్తాం” అని ఆశ చూపారు. మెమోల పిచ్చిలో ఉన్న ఆ బాలుడు ఏమాత్రం ఆలోచించకుండా, బీరువాలో ఉన్న రూ. 85 లక్షల విలువైన బంగారు ఆభరణాలను తీసుకెళ్లి ఆ వ్యాపారులకు అప్పగించాడు.ఇటీవల ఆ బాలుడి అత్త తన నగలు కావాలని అడగడంతో కుటుంబ సభ్యులు బీరువా తెరిచి చూశారు. లోపల నగలు కనిపించకపోవడంతో కంగారుపడి బాలుడిని ప్రశ్నించగా, అసలు విషయం బయటపెట్టాడు. మెమోల కోసం ఆ నగలను వ్యాపారులకు ఇచ్చేసినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు.తండ్రి విమలేష్ మిశ్రా ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.ఈ కేసులో ఇద్దరు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.పరారీలో ఉన్న మూడవ నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
…………………………………………….
