తప్పిన ప్రాణాపాయం!!
ఆకేరు న్యూస్ ,డేస్క్: సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని పోతిరెడ్డిపల్లిలో భారీ అగ్నిప్రమాదం. స్థానిక శ్రద్ధ ప్రైవేట్ స్కూల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనం మొత్తానికి విస్తరించాయి.పోతిరెడ్డిపల్లిలోని ‘జి ప్లస్ 3′(G+3) స్కూల్ భవనం. గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్ల మంటలు అంటుకున్నట్లు అనుమానిస్తున్నారు. చూస్తుండగానే మంటలు పైఅంతస్తుల వరకు వ్యాపించాయి. ఫర్నిచర్, రికార్డులు ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కావడంతో విద్యా సంస్థకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రమాద సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ స్కూల్లో లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
