తల్లిదండ్రులు మందలించారని నలుగురు చిన్నారుల ఆత్మహత్య!!
ఆకేరు న్యూస్ ,డేస్క్: బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. అబ్బాయిలతో మాట్లాడారనే కారణంతో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన నలుగురు బాలికలు బలవన్మరణానికి పాల్పడ్డారు. 10 నుండి 14 ఏళ్ల మధ్య వయస్సు గల నలుగురు బాలికలు మృతి చెందగా, మరో బాలిక ప్రాణాలతో బయటపడింది. ఒక బృందంగా ఉన్న అబ్బాయిలతో మాట్లాడినందుకు తల్లిదండ్రులు తీవ్రంగా కోప్పడటంతో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత, బాలికల అంత్యక్రియలు పూర్తయ్యాక పోలీసులకు సమాచారం అందింది. దీనిపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
