* కరీంనగర్ పోలింగ్ కేంద్రంలో కుక్కల కలకలం…
*పోలింగ్ సిబ్బందిపై కుక్కల దాడి!
ఆకేరు న్యూస్, కరీంనగర్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్ జిల్లాలో ఒక ఊహించని సంఘటన చోటుచేసుకుంది. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, విధుల్లో ఉన్న అధికారులపై వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. ఎన్నికల పోలింగ్ కేంద్రం ప్రాంగణంలోనే రెండు పిచ్చి కుక్కలు ఒక్కసారిగా సిబ్బందిపై దాడికి తెగబడ్డాయి. అక్కడ ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో ముగ్గురు ఎన్నికల అధికారులు గాయపడినట్లు సమాచారం. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది, బాధితులకు అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారికి టీకాలు (Vaccination) వేయించి జాగ్రత్తగా ఇంటికి పంపించారు. మరోవైపు, ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.
