* క్షేమంగా గమ్యం చేరండి
… సీఐ వేణు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జాగ్రత్తగా వాహనాలు నడపండి… క్షేమంగా గమ్యం చేరండని స్టేషన్ ఘన్ పూర్ సీఐ జి.వేణు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రం జాతీయ రహదారిపై రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వాహన చోదకులని స్థానిక పోలీసులు గురువారం పూలతో సత్కరించారు. వరంగల్ కమిషనర్, జనగామ డిసిపి ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకండి, వాహనంపై పరిమితి మించి వెళ్ళకండి, అతివేగం ప్రమాదకరం, హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటూ వాహనదారులను చైతన్యపరిచారు. అదే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వచ్చిన వాహనదారులకు పూలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపడం వల్ల మీరు క్షేమంగా ఉండడమే కాకుండా మీపై ఆధారపడిన మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉంటారని సీఐ వివరించారు. పోలీసులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు పరచడమే కాకుండా వాహనదారులు రోడ్డు భద్రత పట్ల అవగాహన పెంచుకొని ప్రమాదాలను నివారించాలని కోరారు. ఆయన వెంట ఎస్సై పిట్ట రాజేష్ సిబ్బంది ఉన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
