తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు…
45 మందికి కొత్త బాధ్యతలు.. పూర్తి జాబితా ఇదే!
ఆకేరు న్యూస్ , హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం ఒకేసారి 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించడంతో పాటు, కీలక శాఖలకు కొత్త సెక్రటరీలను కేటాయించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల బాధ్యతల్లో కీలక మార్పులు జరిగాయి. ఇప్పటివరకు ఆ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సంజయ్ కుమార్ పి.ఆర్ & ఆర్డీ (పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి) శాఖకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎన్. శ్రీధర్ ఐటీ & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు, విపత్తు నిర్వహణ శాఖ అదనపు బాధ్యతలను ఎం. దన కిషోర్‌కు అప్పగించారు. ఫైనాన్స్ & ప్లానింగ్ సెక్రటరీగా గౌరవ్ ఉప్పాల్, ఇరిగేషన్ సెక్రటరీగా ఈ. శ్రీధర్ నియమితులయ్యారు.
కొత్త జిల్లా కలెక్టర్ల జాబితా:
ప్రభుత్వం పలు జిల్లాలకు కొత్త సారథులను ప్రకటించింది.
కరీంనగర్: చిత్ర మిశ్రా
మహబూబ్‌నగర్: ఖుష్బూ గుప్తా
వికారాబాద్: దీపక్ తివారి
మెదక్: ప్రతిమా సింగ్
భద్రాద్రి కొత్తగూడెం: అంకిత్
హనుమకొండ: చాహత్ బాజ్‌పాయ్
రాజన్న సిరిసిల్ల: గరిమా అగర్వాల్
యాదాద్రి భువనగిరి: అనురాగ్ జయంతి
జనగాం: సందీప్ కుమార్ ఝా
నారాయణపేట్: ప్రతీక్ జైన్
మహబూబాబాద్: స్నేహ శబరీష్
ముఖ్యమైన ఇతర నియామకాలు:
ముషారఫ్ అలీ ఫరూఖీ: మూడో డిస్కమ్ సీఎండీగా బదిలీ.
జితేష్ వి. పాటిల్: టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా నియామకం.
రాహుల్ బొజ్జా: జీఏడీ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ (బీసీ వెల్ఫేర్ అదనపు బాధ్యత).
డి. దివ్య: ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు.
హనుమంత రావు: ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా బదిలీ.
అదనపు కలెక్టర్ల నియామకం (SCS అధికారులు):
జిల్లాల్లో పాలనను పటిష్టం చేసేందుకు పలువురు స్టేట్ సర్వీస్ అధికారులను అదనపు కలెక్టర్లుగా నియమించారు. ఇందులో భాగంగా ఉమా శంకర్ ప్రసాద్ (నాగర్‌కర్నూల్), పి. చంద్రయ్య (మంచిర్యాల), వై.వి. గణేష్ (వరంగల్), అబ్దుల్ హమీద్ (సిద్ధిపేట) తదితరులకు బాధ్యతలు అప్పగించారు. పరిపాలనలో వేగం పెంచడంతో పాటు, ప్రజలకు సంక్షేమ పథకాలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ భారీ బదిలీలు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
