మావోయిస్ట్ మాజీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు
* ప్రభుత్వ సలహాదారులు కేకే, వేంనరేందర్ రెడ్డితో పాటు డీజీపీ శివధర్ రెడ్డిల హాజరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ నేత దేవ్ జీ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు . సెక్రటేరియట్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మావోయిస్ట్ నేతల మద్య ఆసక్తి కర చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఆయుధాలను వీడి జన జీవన స్రవంతిలోకి వచ్చినప్పుడు చట్ట బద్ద మైన జీవనం కొనసాగించాలని సూచించి నట్లు సమాచారం. అందుకు భిన్నం గా చట్ట విరుద్దమైన కార్యక్రమాలకు పాల్పడకుండా నిర్ణయాలు తీసుకోవాలని హితవు చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే విదంగా లొంగిపోయిన మావోయిస్ట్‌లకు సంబందించి న పాలసీ , రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అసెంబ్లీలో వెల్లడిస్తామని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా వేలాది మంది జైళ్ళలో మావోయిస్ట్ ఖైదీలు ఉన్నారని వారితో చర్చించడానికి అవకాశం ఇవ్వాలని దేవ్ జీ సీఎం ను కోరినట్లుగా చెబుతున్నారు. మరో సారి పూర్తి స్థాయిలో అనేక అంశాలను చర్చిద్దామని రేవంత్ రెడ్డి దేవ్ జీ బృందానికి చెప్పినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో దేవ్ జీతో పాటు మాజీ మావోయిస్ట్ నేతలు మల్లా రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న , సుజాత, దామోదర్, నర్సింహా రెడ్డిలు పాల్గొన్నారు, కాగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారులు కేకే, వేం నరేందర్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
————————————-
