*గ్రామాభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)*
– గ్రామీణ భారతం AIతో మరింత బలం
– రైతాంగం, విద్యారంగం ,ప్రభుత్వ సేవలు ఏఐ తో సామాన్యుల చేరువకు
– ఖచ్చితమైన రియల్ టైం పర్యవేక్షణ
ఆకేరు న్యూస్, ప్రత్యేకం:
గ్రామీణ ప్రాంతాల్లో కృత్రిమ మేధ ప్లాట్‌ఫారమ్‌లు సామాన్యులకు చెంతకు చేరువయ్యింది. ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సర్వజన హితాయ – సర్వజన సుఖాయ అనే నినాదంతో AIని గ్రామీణ భారతానికి అనుసంధానం చేసింది.వ్యవసాయం, విద్యా, సంబంధించిన సమాచారం ఏ. ఐ ద్వారా గ్రామీణులందరికీ అందుబాటులోకి వచ్చింది. భాషిణి, సభసార్, -ప్రహరి వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీలు భాషా అవరోధాలను తొలగించి, గ్రామ సభల నిర్వహణను సులభం చేసి, గ్రామీణ అభివృద్ధి పనులను రియల్ టైం లో పర్యవేక్షిస్తున్నాయి .
*వ్యవసాయ రంగం*
వ్యవసాయ రంగంలో AI ద్వారా రైతులకు ప్రయోజనాలు చేకూరుతున్నాయి. QKisan e-Mitra వంటి వర్చువల్ అసిస్టెంట్ ద్వారా పంటల సలహాలు, వాతావరణ హెచ్చరికలు, పురుగుల నివారణ సంబంధించిన సమాచారాన్ని స్థానిక భాషల్లో అందిస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన Bharat-VISTAAR అనే మల్టీలింగ్వల్ AI టూల్ రైతులకు వ్యక్తిగత సలహాలు కూడా ఇస్తోంది. దీని వల్ల పంట దిగుబడి పెరిగి, ఖర్చులు తగ్గనున్నాయి.
*విద్యా రంగం*
విద్యా రంగంలో DIKSHA ప్లాట్‌ఫాం, YUVAI ప్రోగ్రామ్‌ల ద్వారా గ్రామీణ విద్యార్థులకు AI ఆధారిత వ్యక్తిగత బోధన అందుబాటులో ఉంది. అలాగే, భారత్‌జెన్ (BharatGen), ఆది వాణి వంటి భాషా మోడల్స్ గిరిజన ప్రాంతాల్లో స్థానిక భాషల్లో సేవలు అందిస్తున్నాయి.
*ఏఐ భాషిణి*
దీని ద్వారా ప్రతి ఒక్కరూ తన సొంత భాషలోనే ప్రభుత్వ విధానాలను తెలుసుకోగలుగుతారు. భాషా అవరోధాలను తొలగించే ఏఐ 2022లో ప్రారంభమైన భాషిణి, జాతీయ సహజ భాషా అనువాద మిషన్ లో భాగంగా 36కి పైగా భారతీయ భాషల్లో అనువాదం, వాయిస్-టు-టెక్స్ట్, వాయిస్ ఇంటర్‌ఫేస్‌లను అందిస్తుంది. ఈ ఏఐ 23కి పైగా ప్రభుత్వ సేవలతో అనుసంధానమైంది. రైతులు తమ స్థానిక భాషలోనే పీఎం-కిసాన్ వివరాలు, ప్రభుత్వ పథకాలు తెలుసుకోవడానికి, అక్షరాస్యతా సమస్యలను అధిగమించి, గ్రామీణులకు డిజిటల్ సేవలను సులభం చేస్తోంది. మంత్రిత్వ శాఖ వివిధ కాన్ఫరెన్సులు, సెమినార్ నిర్వహించినప్పడు భాషిణిలోని వానియానువాద్ (వాయిస్ టు వాయిస్) ను ఉపయోగిస్తుంది. స్థానిక భాషలలో కంటెంట్ ను పంపిణీ చేయడానికి దీని ద్వారా అవకాశం కలుగుతుంది.
*ఏఐ సభసార్*
కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రవేశపెట్టిన ‘సభసార్’ (Sabhasaar) అనేది గ్రామ పంచాయతీల పాలనలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత యాప్. గ్రామసభల నిర్మాణాత్మక మినిట్స్ రూపొందించడానికి తయారు చేయబడింది. ఏఐ గ్రామ సభలు, పంచాయతీ సమావేశాల ఆడియో/వీడియో రికార్డింగ్‌ల నుంచి మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ ను తయారు చేస్తుంది. భాషిణితో అనుసంధానమై 13-14 భారతీయ భాషల్లో నివేదికలు ఇస్తుంది. ఇది 2.5 లక్షలకి పైగా పంచాయతీల్లో డాక్యుమెంటేషన్ భారాన్ని తగ్గించి, నిర్ణయాలు, చర్యలను స్పష్టంగా, నిష్పక్షపాతంగా రికార్డు చేస్తుంది. గ్రామీణ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగాయి.
*భూ-ప్రహరి*
ఇది MGNREGA పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఆస్తులను పర్యవేక్షించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).భూ-ప్రహరి – గ్రామీణ అసెట్ల పర్యవేక్షణకు ఏఐ, జియోస్పేషియల్ టెక్నాలజీ 2025 మేలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఐఐటీ ఢిల్లీ సహకారంతో ప్రారంభమైన భూ-ప్రహరి ఏఐ, సాటిలైట్ ఇమేజరీ, జియోస్పేషియల్ టెక్నాలజీలతో ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద తయారైన అసెట్లను (రోడ్లు, నీటి వనరులు మొదలైనవి) నిజ సమయంలో పర్యవేక్షిస్తుంది. గ్రౌండ్ & సాటిలైట్ డేటా ఆధారంగా విశ్లేషణ చేసి, అసెట్ల స్థితిని ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఇది గ్రామీణ అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకతను మరింత పెంచుతోంది.
ఈ ఏఐ సాధనాలు డిజిటల్ ఇండియా, వికసిత్ భారత్ లక్ష్యాలకు దోహదపడుతున్నాయి. అయితే, డిజిటల్ డివైడ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, AI అక్షరాస్యత వంటి సవాళ్లు ఇంకా ఉన్నాయి. ప్రభుత్వం బాధ్యతాయుత AI వినియోగాన్ని నిర్ధారిస్తోంది. India–AI Impact Summit 2026 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ “సర్వజన హితాయ సర్వజన సుఖాయ” అనే నినాదంతో AIని గ్రామీణ భారతానికి అనుసంధానం చేయాలని పిలుపునిచ్చారు. ఇది Viksit Bharat@2047 లక్ష్యానికి కీలక అడుగు అవుతోంది.
