* సామాన్య ప్రజలకు న్యాయం జరగాలి- జిల్లా ఎస్ పి కేకాన్ సుధీర్ రామనాధ్.
ఆకేరు న్యూస్,ములుగు:
ములుగు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ కేసులను పరిష్కరించి సామాన్యులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేక సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నెలవారి నేర సమిక్ష కార్యక్రమం నిర్వహించారు.
ఈ సమావేశంలో ములుగు, ఏటూరునాగారం డివిజన్లకు చెందిన సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ లు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జిల్లాలో పరిష్కరించబడని కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. నేర తీవ్రత ఎక్కువ కలిగిన కేసులు, ఆస్తి సంబంధిత కేసులు పరిశీలించారు.
మహిళలపై నేరాలు , ఫోక్సో కేసులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు .బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని ఈ కేసులలో చట్టపరమైన చర్యలు కచ్చితంగా తీసుకోవాలని సూచించారు.
ఎన్డీపీఎస్ కేసులు, అక్రమ ఇసుక రవాణా, ఐడి లిక్కర్, ఐఎంఎఫ్ఎల్ అక్రమాలు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, బెల్లం దందా ఎన్ఫోర్స్మెంట్ కేసులపై సమీక్ష నిర్వహించారు , అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో నేర నియంత్రణకు ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా పని చేసి, ప్రజల్లో భద్రతా భావాన్ని మరింత బలోపేతం చేయాలని జిల్లా ఎస్పీ అదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏ ఎస్ పి మనన్ బట్, అదనపు ఎస్ పి సదానందం, డి ఎస్ పి కిషోర్ కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శంకర్, పస్రా సిఐ దయాకర్, ఏటూరునాగారం సి ఐ శ్రీనివాస్, వెంకటాపురం సీఐ ముత్యం సురేష్, జిల్లాలో గల పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
