*బ్యాంకు సేవలు వినియోగించుకోండి
*ఎస్ బిఐ బ్రాంచ్ మేనేజర్ రాజు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
నూతనంగా ప్రారంభించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) సేవలను మండల ప్రజలు వినియోగించుకోవాలని ఎస్బిఐ చిల్పూర్ బ్రాంచ్ మేనేజర్ ఆరగొండ రాజు కోరారు. మండలంలోని వెంకటేశ్వర పల్లిలో ఏర్పాటు చేసిన ఎస్బిఐ నూతన శాఖను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజలకు బ్యాంకు సేవలు అందించడంతోపాటు బంగారం పై రుణాలు, వ్యవసాయ రుణాలు ఇచ్చి వారి అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. మీకు సమీపంలోనే ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – చిల్పూర్ బ్రాంచ్ నుండి మీ బ్యాంకింగ్ అవసరాలన్నీ సులభంగా, వేగంగా, పొందవచ్చు అన్నారు. సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్, పర్సనల్ లోన్స్ , గోల్డ్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్, ఏటీఎం డెబిట్ కార్డ్ సదుపాయం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు, డి బి టి సేవలు అందించనున్నట్లు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

మల్కాపూర్ లో వుంటే బాగుండును చుట్టుప్రక గ్రామాల ప్రజలకు సౌకర్యవంతగా వుండును. బ్రాంచ్ పేరు చిల్పూర్ గానే కోనసాగించండి. బ్రాంచి అభివృద్ది చెందాలంటే మల్కాపూర్ లోనే ఉండాలి ఖాత దారులకు సౌకర్యవంతమైన ప్లేస్ కావాలి ఇది నా వ్యక్తి గత అభిప్రాయం.