Iran Baahubali Scene
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (UNGA)లో చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ బాహుబలి సినిమా సన్నివేశాన్ని జోడించింది. ప్రభాస్ కథానాయకుడిగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి: ది బిగినింగ్ లోని కీలక యుద్ధ ఘట్టాన్ని ఎక్స్‌లో షేర్ చేసింది.
వీడియోలో అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కలకేయ సైన్యంతో పోరాడే సన్నివేశం కనిపిస్తుంది. భారీ సైన్యాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ బాహుబలి వెనక్కి తగ్గకుండా పోరాడతాడు. ఈ సన్నివేశం సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఐరాసలో పెజెష్కియాన్ చేసిన మేము ఎప్పటికీ తల వంచం.. మోకరిల్లం అనే వ్యాఖ్యకు ప్రతీకగా ఈ సన్నివేశాన్ని ఇరాన్ కాన్సులేట్ ఉపయోగించింది. వీడియోను షేర్ చేస్తూ అధ్యక్షుడి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఇరాన్ అధికారిక సోషల్ మీడియా పోస్టులో బాహుబలి సీన్ చర్చనీయాంశంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
