* నిందితుడు రిమాండ్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించి ఆభరణాలు రికవరీ చేశారు జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పోలీసులు. ట్రైని ఐపీఎస్ అధికారి మనీషా కథనం ప్రకారం… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా రాజ హోమంగి మండలం వంచంగి గ్రామానికి చెందిన మోడం తలుపులయ్య జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తానేదారుపల్లి గ్రామ శివారులోని కోళ్ల ఫారంలో ఫిబ్రవరి మూడో తేదీన దొంగతనానికి పాల్పడతాడు. కోళ్ల ఫారం వద్ద పనిచేస్తున్న గడెం కొమరయ్య నివాసముండే గదిలో నుండి రెండున్నర తులాల పుస్తెలతాడు, అర్థ తులం ఉంగరాన్ని తలుపులయ్య దొంగిలించాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎస్ మనీషా స్థానిక ఎస్సై మనీషా తమ సిబ్బందితో బుధవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా తలుపులయ్య అనుమానాస్పదంగా కనిపించడంతో అతని అదుపులోకి తీసుకొని విచారించగా నెల 15 రోజుల క్రిందట దొంగతనానికి పాల్పడిన విషయాన్ని అంగీకరించాడు. దొంగిలించిన ఆభరణాలను రికవరీ చేసుకొని నిందితున్ని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
