* తెలంగాణ బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యురాలు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నవారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యురాలు అనుమాండ్ల శోభారాణి విద్యార్థులకు ఉద్బోధించారు. తెలంగాణ మోడల్ స్కూల్ ఘనపూర్ లో జరిగిన ” రోల్ మోడల్స్ తో బాలికల గోష్టి” కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ జీవితంలో పైకి ఎదిగిన వారంతా అనేక కష్టనష్టాలు అవరోధాలు అధిగమించి వచ్చిన వారేనని, వారి జీవిత అనుభవాలు తెలుసుకుని స్ఫూర్తిని పొందాలని కోరారు. తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఉన్నత ఉద్యోగులు, కళాకారులు, రచయితలు, కవులు ఈ విధంగా విభిన్న రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని రోల్ మోడల్ గా స్వీకరించి విద్యార్థులు తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణు గోపాల రెడ్డి, ఉపాధ్యాయులు లక్పతి, సౌమ్య, సయిరా బేగం తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
