* GWMC సమావేశంలో ఆమోదం
* మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన మీటింగ్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.1040 కోట్ల 58 లక్షల 75 వేల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. బుధవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బల్దియా అకౌంట్స్ అధికారి శివ లింగం బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటి సభ్యులు అంగీకారం తెలపడంతో పాలక వర్గం ఆమోదించింది. ఇందులో రూ.349 కోట్ల 19 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.685 కోట్ల 20 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా, రూ 620 కోట్లు డిపాజిట్లు, అడ్వాన్సుల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు.
*కేటాయింపులు ఇలా..
బల్దియా సొంత ఆదాయం ద్వారా వచ్చే రూ. 349 కోట్ల 19 లక్షలలో 100 కోట్ల రూపాయలు సిబ్బంది జీత భత్యాలు, 40 కోట్ల 75 లక్షల 50 వేల రూపాయలు పారిశుద్ధ్య నిర్వహణకు, 29 కోట్ల 5 లక్షల రూపాయలు విద్యుత్ చెల్లింపులకు, 34 కోట్ల 91 లక్షల 88 వేల రూపాయలు గ్రీన్ బడ్జెట్ కు, 36 కోట్ల 15 లక్షల రూపాయలు ఇంజనీరింగ్ విభాగానికి, 30 కోట్ల 41లక్షల రూపాయలు సాధారణ నిర్వహణకు కోటి 40 లక్షల రూపాయలు టౌన్ ప్లానింగ్ కోసం కోటి 50 లక్షల రూపాయలు కేటాయించారు.
