*బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ‘కనకం రమేష్’
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ‘కనకం రమేష్’ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు కు చెందిన కనకం రమేష్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా కనకం రమేష్, ఉపాధ్యక్షుడిగా టి.ఆర్. సాల్మన్ రాజు, ప్రధాన కార్యదర్శిగా మునిగల రవీందర్, కోశాధికారిగా గుర్రపు బాబు, లైబ్రరీ కార్యదర్శిగా పనికర శ్రీశైలం, మహిళా ప్రధాన కార్యదర్శిగా షణ్ముఖ కుమారి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా అమ్మ రోజు శ్రీనివాస్, మారపాక ప్రాలక్ష్మణ్, తాడూరి వనిత, సిద్ధం శ్వేత, గబ్బెట ఉమారాణి, గోవిందు విజయభాస్కర్ రావు, తాటి కాయల అశోక్, గుర్రం అఖిల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి నద్దునూరి చంద్రమౌళి ప్రకటించారు.
*” రెండవసారి ఏకగ్రీవం…
స్టేషన్ ఘన్ పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కనకం రమేష్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుకు వచ్చే సామాన్య ప్రజలకి బార్ అసోసియేషన్ అండగా ఉండి న్యాయం చేకూర్చే విధంగా కృషి చేస్తా అన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
