ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచడంతో పాటు క్రమం తప్పకుండా సమయ పాలన పాటిస్తూ సర్వీసులను నడపాలని ఆదేశించారు.
శానసమండలి హాల్లో ఎంఎంటీఎస్ సర్వీసులపై నిర్వహించిన సమీక్షలో ఎంఎంటీఎస్‌లో ప్రయాణికుల తగ్గుముఖంపై ఆరా తీశారు. ప్రధానంగా ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, స్టేషన్లు లోపలికి ఉండటంతో అక్కడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వీయ ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రయత్నించాలని అధికారులకు చెప్పారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంపు, వసతులు మెరుగుపరచడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
