* వేలాదిగా తరలివచ్చిన భక్తులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ, చిల్పూర్ మండలం నష్కల్ గ్రామాలలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
తాటికొండ లో కిలా గుట్ట కింద ఉన్న అతి పురాతన ఆలయంలో జీడి కంటి వరుణాచార్యులు, సౌమిత్రి లక్ష్మణాచార్యుల ఆధ్వర్యంలో పండితులు కళ్యాణ క్రతువును శాస్త్రోత్తంగా నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ పండుగ భద్రయ్య సర్పంచ్ మారపాక సృజన శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఎడమ కట్టమల్లు, రాపోలు మధుసూదన్ రెడ్డి పర్యవేక్షించారు. కార్యక్రమంలో తాటికొండ తో పాటు కొత్తపల్లి, మీదికొండ, కృష్ణాజి గూడెం, ఫతేపూర్ గ్రామాల భక్తులు పాల్గొనగా.. గ్రామానికి చెందిన మేకల శ్రీకాంత్ అన్నదాన వితరణ చేశారు.
నష్కల్ లో …
చిల్పూర్ మండలం నష్కల్ లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన చైర్మన్ కోరు కొప్పుల హరికిషన్, సర్పంచ్ శాత బోయిన రాజు ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ మాజీ సర్పంచ్ వెంకటేష్, అశోక్, మోడం బిక్షపతి, పి.యాదగిరి, గంట ఉపేందర్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
తిరుమలనాథ స్వామి ఆలయంలో..
స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ తిరుమలనాధ స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ నీల నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నీల రాజమ్మ గట్టయ్య, పలువురు కౌన్సిలర్లు, స్థానిక ఏసీబీ బీమ్ శర్మ, దేవస్థానం డైరెక్టర్లు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
* కళ్యాణానికి హాజరైన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే
నష్కల్ గ్రామంలో జరిగిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, స్టేషన్ ఘన్ పూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ టి. రాజయ్యలు హాజరయ్యారు. శ్రీ సీతా రామచంద్రస్వామి నీ పూజించి ఆశీస్సులు పొందారు.
