ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని డిఈఈ కార్యాలయం ముందు ఆర్టిజెన్లు, అన్మాండ్ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఆర్టిజన్లు, అన్మాండ్ కార్మికులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అన్మాండ్ కార్మికులు విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. గత కొద్ది రోజులుగా ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేస్తున్న యాజమాన్యం మొండివైఖరి ప్రదర్శిస్తుందన్నారు. రాష్ట్ర జేఏసీ తో చర్చలు జరిపి న్యాయం చేయకుంటే ఏప్రిల్ రెండవ తారీకు సర్కిల్ ఆఫీస్ ముట్టడి వంట వార్పు, 7 తారీఖు ఎన్పీడీసీఎల్ కంపెనీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ యాజమాన్యం స్పందించకపోతే ఎనిమిదో తారీకు నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ చైర్మన్ పాశం రాజు, వైస్ చైర్మన్ బాధావతు లక్ష్మణ్, కన్వీనర్ వీరగోని లక్ష్మణ్, కో కన్వీనర్ చెరుపల్లి సురేష్, నాయకులు ఉబ్బని వెంకటస్వామి, షేక్ బాబా, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
