కుక్కల దాడిలో ఆరేళ్ళ బాలుడు మృతి
* నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భిక్షాటన చేస్తూ జీవించే కుటుంబం అది. మంగళవారం సాయంత్రం తాముంటున్న గుడిసె వద్దకు వచ్చారు. ఓ బాలుడు ఆడుకోవడానికి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం గాలించిగా.., నిర్ఘాంతపోయే దృశ్యం చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మక్తాలో కుక్కల దాడిలో బాలుడు సాత్విక్ (6) మృతి చెందాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు కనిపించకపోవడంతో.. తల్లిదండ్రులు గాలించగా ఆచూకీ ఎక్కడా కనిపించలేదు. చివరకు ఈరోజు ఉదయం మక్తాలోని నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు, బాలుడి శరీరంపై కుక్కలు దాడి చేసిన కాట్లను గుర్తించారు. కుక్కలే దాడి చేసి చంపేశాయని గుర్తించారు. వారు నివసిస్తున్న ప్రదేశం డంపింగ్ యార్డ్ కావడంతో అక్కడ అధికంగా కుక్కలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
——–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
