*అధికారిక ప్రకటన వచ్చేవరకు..
*కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్,
*కాంగ్రెస్ నేతలను సైతం కలుపుకొని డంపింగ్ యార్డ్ రద్దు కై పోరాటం
* హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
హుజూరాబాద్ పట్టణ శివారులో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆదివారం 14వ రోజున హుజురాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో జరుగుతున్న నిరసన దీక్షా శిబిరాన్ని కౌశిక్ రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, నివాస ప్రాంతాల సమీపంలో చెత్త యార్డును నిర్మించడం ప్రభుత్వ మొండివైఖరికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఇది పార్టీలకు అతీతమైన పోరాటమని పేర్కొన్న ఆయన, రేపు బీజేపీ చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి కూడా హాజరవుతానని కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ నేతలను సైతం కలుపుకొని ఒకే వేదికగా డంపింగ్ యార్డ్ రద్దు అయ్యేవరకు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకు వస్తానన్నారు. ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ వచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని అన్నారు. సిఐడి ఎంక్వయిరీ లో కూడా హుజురాబాద్ డంపింగ్ యార్డ్ సంబంధించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పానన్నారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఈ నెల 7, 8 తేదీలలో ఎమ్మెల్యే స్వయంగా రెండు రోజుల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
