BJP foundation day flag hoisting Telangana
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండలాలలోని పలు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణలు నిర్వహించింది. చిల్పూర్ మండల కేంద్రంలో మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంటె ఉపేందర్ జెండా ఆవిష్కరణ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రతిపల్లెకు న్యాయం జరుగుతోందని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాల్నే శ్రీనివాస్, జిల్లా మీడియా కన్వీనర్ కాదుగాయ రమేష్, జిల్లా నాయకులు పెండ్యాల దిలీప్ కుమార్, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కందుకూరు రజినీకాంత్, పింజర రంజిత్, అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

.. వివిధ గ్రామాలలో…
అనంతరం మండలంలోని నష్కల్, వంగాలపల్లి, పల్లగుట్ట, కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి, దేశాయ్ తండాలలో స్థానిక నాయకులు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.

.. తాటికొండలో.
భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా తాటికొండలో 59 బూత్ అధ్యక్షుడు పిల్లిరాజు, 61 బూత్ అధ్యక్షుడు అక్కనపెల్లి మహేందర్ , గ్రామ శాఖ అధ్యక్షులు నారాబోయిన శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో బిజెపి జెండా ఆవిష్కరణ జరిగింది. ఈకార్యక్రమానికి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి, జిల్లా నాయకులు ఇనుగాల యుగేందర్, గాజుల సంపత్, మండల అద్యక్షులు సట్ల వెంకటరమణ, నియోజకవర్గం బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ తౌటి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, జెనరల్ సెక్రటరీ మంద రాజేష్ రెడ్డి, నాయకులు సానాది క్రాంతి, చింతపండు మహేష్, మూసిని ప్రసాద్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
