Bodrai Bhoomi Puja
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం దేశాయి తండాలో సోమవారం బొడ్రాయి (గ్రామ దేవతలు) ప్రతిష్టకు భూమి పూజ జరిగింది. గ్రామ సర్పంచ్ భూక్య వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గురువు ధనుంజయ రెడ్డి, పూజారి వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి బొడ్రాయి ప్రతిష్టకు ముగ్గు పోశారు. కార్యక్రమంలో చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మాజీ జెడ్పిటిసి స్వామి నాయక్ గ్రామ పెద్దలు భూక్య శ్రీనివాస్, హేమా నాయక్, బంగ్య, శ్రీను వార్డు సభ్యులు లలిత, సుందర్, కాశీనాథ్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
