MP KADIYAM KAVYA THOUSAND PILLAR TEMPLE DEVELOPMENT
* వేయి స్తంభాల గుడి అభివృద్ధికి రూ.14.44 కోట్ల కేంద్ర నిధుల మంజూరి
* ఎంపీ కడియం కావ్య కృషితో వేయి స్తంభాల గుడికి భారీ నిధులు.
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు గా కృషి చేస్తున్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య మరో ఘనత సాధించారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన హనుమకొండలోని రుద్రేశ్వర స్వామి (వేయి స్తంభాల) గుడి సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.14.44 కోట్ల భారీ నిధులను మంజూరు చేయించడంలో ఆమె విజయం సాధించారు.
* శభాష్ ఎంపీ కావ్య ..
వేయి స్తంభాల ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపం విస్తరణ, మిగిలిపోయిన పునరుద్ధరణ పనుల కోసం నిధులు కేటాయించాలని ఎంపీ డా. కడియం కావ్య గత కొంతకాలంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను పలుమార్లు కలిసి, ఆలయ విశిష్టతను మరియు అభివృద్ధి అవసరాన్ని వివరించారు. ఎంపీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం, తాజాగా ఈ నిధులను కేటాయించింది. దీంతో వరంగల్ ప్రజలు ఎంపీ కావ్య పనితీరు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శభాష్ కావ్య అంటూ అభినందిస్తున్నారు.వారసత్వ సంపదను కాపాడుకుంటూనే నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎంపీ డా. కడియం కావ్య కృషి పట్ల వరంగల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
* త్వరలో పనులు ప్రారంభం
గతంలో ఎంపీ స్వయంగా పురావస్తు శాఖ (ASI) అధికారులతో కలిసి ఆలయాన్ని సందర్శించి, పనుల్లో జాప్యాన్ని గుర్తించారు. తక్షణమే నివేదికలు సిద్ధం చేయించి కేంద్రానికి పంపారు. కేంద్ర పురావస్తు శాఖ ఇప్పటికే ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలవడంతో, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.


*కేంద్ర మంత్రి షెకావత్‌కు కృతజ్ఞతలు : ఎంపీ కావ్య
నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు మరియు పురావస్తు శాఖ అధికారులకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “కాకతీయుల శిల్ప కళా వైభవానికి వేయి స్తంభాల గుడి ఒక నిదర్శనం. ఈ నిధులతో ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడమే మా లక్ష్యం. దీనివల్ల పర్యాటక రంగం మెరుగుపడటమే కాకుండా స్థానిక ప్రజల ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుంది” అని పేర్కొన్నారు.
————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
