Kadiyam Srihari Gram Panchayat building
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
వెంకటేశ్వర పల్లికి నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం వెంకటేశ్వర పల్లి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు చిల్పూర్ దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యేని కలిసి జిపి భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గ్రామస్తుల ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర పల్లి గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తానన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నిధుల కేటాయింపుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సర్పంచ్ శివరాత్రి రేణుక వీరస్వామి, ఉప సర్పంచ్ పల్లెపాటి రజనీకర్, వార్డు సభ్యులు నవీన్, వెంకటేష్, సురేష్, మాజీ జెడ్పిటిసి స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
