నేటి నుంచి ప్రజావాణి మళ్ళీ ప్రారంభం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎన్నికల కోడ్ ముగియడంతో సాధారణ పాలనా కార్యకలాపాలు మొదలవుతున్నాయి. తెలంగాణలో నేటి నుంచి అంటే జూన్ 7 నుంచి ప్రజావాణి (Prajavani) పునఃప్రారంభమైంది. ప్రజావాణి ఇంఛార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం..నేటి నుంచి అంటే శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండటం వల్ల ప్రజావాణి అర్జీల కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడినట్లలు చిన్నారెడ్డి వివరించారు. మొత్తంగా ఇకపై లోక్ సభ ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో (Praja Bhavan) ప్రతి వారం మంగళ, శుక్ర వారాల్లో కొనసాగుతుందని చిన్నారెడ్డి చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలంతా తమ తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని ఆయన కోరారు. అయితే, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు.
———————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
