* హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాల సాధన లక్ష్యంగా పనిచేస్తామని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం హుజురాబాద్లో మహాత్మ జ్యోతిబాపూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్, పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కుగా విద్య అందాలని పోరాడిన మహనీయులు పూలే దంపతులని కొనియాడారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి వారే పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకున్నారని, రాబోయే తరాలకు ఇలాంటి వేడుకలు స్ఫూర్తినిస్తాయని అన్నారు. హుజురాబాద్లో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న కమిటీ విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడిందని, స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖను పర్యవేక్షిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలలు, ఎం జె పి విద్యాలయాలు ప్రైవేట్ సంస్థలకు ధీటుగా రాణిస్తున్నాయని ప్రణవ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అబ్జర్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, జయంతి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
