Heatstroke railway worker rescue
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రైల్వే గేటు వద్ద రైల్వే లైన్ పనిచేస్తున్న గాదె వినయ్ కుమార్ అనే రైల్వే కార్మికుడు తీవ్రమైన ఎండ వల్ల వడదెబ్బ తగలడంతో అస్వస్థతకు గురయ్యాడు. కింద పడిపోయిన కార్మికుడికి వైద్య సహాయం అందించేందుకు తోటి కార్మికులు 108 కాల్ చేసి సమాచారం ఇచ్చారు. స్పందించిన స్థానిక అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ హరికృష్ణ, పైలెట్ యాకయ్య క్షణాల్లో సంఘటన స్థలం చేరుకొని బాధితునికి అంబులెన్స్ లో ఎమర్జెన్సీ చికిత్స నిర్వహిస్తూ కాజీపేట రైల్వే హాస్పిటల్ నందు చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా అవుతుండడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రాణాపాయస్థితి ఏర్పడిన వెంటనే 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ కి కాల్ చేసి సేవలను వినియోగించగలరని తెలియజేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
