NREGS transparency CPM demand
ఎంపిక చేసిన పనులను బహిర్గతం చేయాలి
.. సిపిఏం డిమాండ్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
నేసనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ (NREGS) ద్వారా చిల్పూర్ మండలంలో ఎంపిక చేసిన పనులను బహిర్గతం చేయాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి సాదం రమేష్ డిమాండ్ చేశారు.
చిల్పూర్ మండల కేంద్రంలో శనివారం సీపీఎం పార్టీ మండల కమీటి సమావేశం సాదం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో మండల కార్యదర్శి సాదం రమేష్ మాట్లాడుతూ మండలంలో NREGS ద్వారా అన్ని గ్రామాలలో గుర్తించిన పనులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఏ గ్రామంలో CC రోడ్లు, మహిళా సంఘాల భవనాలు, స్కూల్ ప్రహరీగోడ నిర్మాణాలు, హెల్త్ సెంటర్ లు. డ్రైనేజి, తదిర పనులను గుర్తించారు ? ఏ గ్రామానికి ఎన్ని లక్షల చొప్పున నిధులు విడుదల చేసారో స్పష్టంగా తెలియచేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షపార్టీ సర్పంచ్ లు గెలిచిన గ్రామాలకు ఎన్నినిధులు ఇచ్చారో ? తెలియచేయాలనీ పక్షపాతం లేకుండ చిల్పూర్ మండల సమాగ్రాభివృదిని చేయాల్సిoది పోయి కొంతమంది బడా నాయకులు ఉన్న గ్రామాలకే ఎక్కువ నిధులు ఇస్తూ మీగుతా గ్రామాలను చిన్న చూపు చూడడం తగదని ఇప్పటికైన అన్ని గ్రామాలకు నిధులు కేటాయించి అభివృద్ధి పరుచాలని సీపీఎం పార్టీ మండల కమీటి కోరనైనది. ఈ సమావేశంలో ఆవుల ప్రభాకర్, ఉరడి బుచ్చిరాజ్, సాదం రాజు, నారబోయిన బుచ్చయ్య, సాదం రామరాజు.తదితరులు పాల్గొన్నారు.
