paddy procurement centers JANGAON
*కొనుగోలు కేంద్రాలకు తేండి – గిట్టుబాటు ధర పొందండి
మార్కెట్ కమిటీ చైర్పర్సన్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరను పొందాలని స్టేషన్ ఘన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం సముద్రాల, రంగరాయ గూడెం, ఇప్పగూడెం, అక్క పెళ్లి గూడెం, తాటికొండ గ్రామాల్లో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా వరిధాన్యం దిగుబడి అవుతుందని అందులో మన నియోజకవర్గం జిల్లాలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐకెపి సెంటర్లతో మహిళలకు ఉపాధి, రైతులకు సరైన మద్దతుధర లభిస్తుందని అన్నారు. సన్నధాన్యం క్వింటాలుకు రూ. 500 బోనస్ అందిస్తున్నామని అన్నారు. తరుగు, తాలు లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు మందపురం రాణి అనిల్, లక్ష్మణ్, మారపాక సృజన శ్రీనివాస్, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సివిల్ సప్లై డ్యూటీ శ్రీనివాస్ సీసీలు ప్రవీణ్, సహదేవ్ ఆయా గ్రామాల గ్రామైక్య సంఘాల సభ్యులు సిఏలు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
