MLA KAUSHIK REDDY KAMALAPUR GRAIN PROCUREMENT
* ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్:
రవాణా చేసే ధాన్యంని జిపిఎస్ లో ఆన్లైన్ చేస్తే రైతులు వాహనాల కొరతతో అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం కమలాపూర్ మండలంలో గూడూరు, కమలాపూర్, ఉప్పల్, మర్రిపల్లిగూడెం లో ఐకేపీ, పిఏసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం,మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి , వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినందుకు మార్క్ఫెడ్ ఎండి కి అభినందనలు తెలిపారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకూడదని, అనవసరంగా కోతలు విధించకుండా, న్యాయంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు. ప్రతి రైతుకు ధాన్యం రవాణా ఖర్చు 150 రూపాయలు దాకా అవుతుందని, ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ₹36 చెల్లిస్తోంది. కానీ, కాంట్రాక్టర్లు రైతులకు కేవలం 10-15 మాత్రమే ఇస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.36ను రైతులకు పూర్తిగా చెల్లించాలని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ మేన శ్రీను, ఎంపీడీవో గుండె బాబు , ఐకేపీ ఏపీఎం లలితా దేవి , కాంగ్రెస్ నాయకులు బాలసాని రమేష్ గౌడ్, బొల్లం రాజిరెడ్డి, గుండపు చరణ్ పటేల్, మొండెద్దుల నాగరాజు, వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య, మార్కెట్ డైరెక్టర్లు గట్టు శ్రీధర్, జనగాని శివకృష్ణ, ఆకినపల్లి బిక్షపతి, నిగ్గుల లింగయ్య, కిన్నెర కృష్ణమూర్తి, యాకోబు, చెరుపల్లి రామచంద్రం, అబ్బరవేణి అనిల్, చందబోయిన సాయికుమార్, భాషబోయిన రమేష్, ఆయా గ్రామాల సర్పంచులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
