Kharge effigy protest Telangana
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై “టెర్రరిస్ట్” అని అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిష్టి బొమ్మను జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో దహనం చేశారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆదేశాలు జనగాం జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ సూచన మేరకు బిజెపి చిల్పూర్ ఎస్సి మోర్చా మండల అధ్యక్షులు కందుకూరు రజినీకార్ ఆధ్వర్యంలో చిల్పూర్ మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అధ్యక్షులు ఖర్గే దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజెపి చిల్పూర్ మండల అధ్యక్షులు గంటె ఉపేందర్ హాజరై మాట్లాడుతూ 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో భారతదేశంలో అనేకమైన టెర్రరిస్టుల దాడులు జరిగినవి. 2014 నుండి నేటి వరకు మోడీ ప్రభుత్వంలో టెర్రరిస్టులను. అంతమొందించడం జరిగింది. భారతదేశం ప్రశాంతమైన వాతావరణంలో భారతదేశం ఉంది. ప్రపంచ దేశాలు మన మోడీని మెచ్చుకోవడం జరుగుతుంది. మన దేశంలోని కాంగ్రెస్ నాయకులు మోడీ చూస్తే కాంగ్రెస్ జాతీయ నాయకులకు చలి జ్వరం పుడుతుంది అని అన్నారు. జిల్లా నాయకులు తోకల సంపత్ రెడ్డి, బాల్నే శ్రీనివాస్, పెండ్యాల దిలీప్ కుమార్, మండలప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, ఓబీసీ మండల అధ్యక్షులు ఊరటి రాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు తోట రంజిత్ కుమార్, మండల నాయకులు సాదం భీమ్మన్న యాదవ్, పొలాబోయిన జోగులు, తోట శ్రీనివాస్, వంశీ, శైలేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
