Kavitha Telangana Rashtra Sena party
* తెలంగాణ రాష్ట్ర సేన (కవిత) పార్టీతో సామాజిక న్యాయం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసే కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన తో సామాజిక న్యాయం జరుగుతుందని భూపాలపల్లి జిల్లా జాగృతి కార్యదర్శి నరేష్ నేత అన్నారు. కల్వకుంట్ల కవిత ఏర్పాటుచేసే కొత్త పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి వెళుతున్న భూపాలపల్లి జాగృతి కార్యకర్తలు జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒక వర్గానికి న్యాయం జరిగింది తప్ప అని కులాలు, మతాలు, వర్గాలు జాతులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్నారు. ఉద్యమకారులకు గుర్తింపు దక్కలేదని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కరువు, ఉపాధి మార్గాలు లేక అసంఘటిత కార్మికులు ఎన్నో అవస్థలు పడుతున్నారని వివరించారు. తెలంగాణ జాగృతి రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుందన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ జనసేన కొత్త పార్టీ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం సామాజిక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం భూపాలపల్లి జిల్లా నుండి దాదాపు 300 మంది జాగృతి కార్యకర్తలు హైదరాబాద్ కు వెళ్తున్నట్లు నరేష్ వివరించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కొత్త పార్టీ కృషి చేస్తుందన్నారు. ఆయన వెంట రాజు, హరికృష్ణ, రాజ్ కుమార్, అవినాష్, సిరాజ్, విష్ణు, సందీప్, లడ్డు, విగ్నేష్ తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ తరలి వెళ్లారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
