Lungi Ngidi IPL Injury
* హుటా హుటిన ఆస్పత్రికి తరలింపు
ఆకేరు న్యూస్ , డెస్క్ : దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ క్రికెటర్ లుంగీ ఎన్గిడీ తీవ్రంగా గాయపడ్డాడు.
ఢిల్లీలో ఐపీఎల్ -2026 మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.
ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న ఎంగిడీ శనివారం క్యాచ్ పట్టబోయి గ్రౌండ్ లో పడిపోయాడు. బాధతో మెలికలు తిరుగుతున్న ఎంగిడీని చూసిన ఎంపైర్లు, సహచర క్రికెటర్లు వెంటనే అక్కడికి చేరుకున్నారు. హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. భారీ కాయుడైన ఎంగిడీ క్యాచ్ పట్టేటప్పుడు పడిపోవడంతో తల నేలకు బలంగా తాకింది. మొత్తం శరీరం బరువు అంతా మెడ మీద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఎంగిడీ స్థానంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దశమంత చమీరా ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకున్నారు.
*ఐపీఎల్ గాయపడ్డ క్రికెటర్లూ వీరే..
ఐపీఎల్ చరిత్రలో మ్యాచ్ జరుగుతుండగా లేదా టోర్నీ మధ్యలో గాయపడడం కొత్తేమీ కాదు. ఈ సీజన్ తో పాటు గతంలోనూ పలువురు స్టార్ ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు: సీఎస్కే కు ఆడుతున్న ఆయుష్ మహత్రే , ఖలీల్ అహ్మద్ లు గాయాల కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. కేకేఆర్ టీం కు చెందిన హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా ఈ సీజన్ ప్రారంభానికి ముందే దూరమయ్యారు.
గుజరాత్ టైటాన్స్ (2023 ) కు చెందిన కేన్ విలియమ్సన్ చెన్నైతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్లోనే బౌండరీ దగ్గర క్యాచ్ పట్టబోయి మోకాలికి తీవ్ర గాయమై టోర్నీకి దూరమయ్యారు.
.ఎస్సార్ హెచ్ ( SRH -2016) కు చెందిన యువరాజ్ సింగ్ సీజన్ ప్రారంభంలో చీలమండ (Ankle) గాయంతో కొన్ని కీలక మ్యాచ్లకు దూరమయ్యారు.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
