KCR CRITICISES CONGRESS GOVERNMENT TELANGANA
* రైతు పరిస్థితి దారుణం..
* ధాన్యం కొనడం ఈ ప్రభుత్వానికి చేతకాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై మరియు కేంద్ర వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
* రైతుల పరిస్థితిపై ఆందోళన…
రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని కేసీఆర్ విమర్శించారు. “మేము రైతుల సంక్షేమం కోసం ‘రైతు బంధు’ తెచ్చాం. కానీ నేడు ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు చేయడం కూడా చేతకావడం లేదు. ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు, పరిస్థితి అంతా గందరగోళంగా (బొందల పడ్డట్టు) తయారైంది” అని ఆయన మండిపడ్డారు.
* పార్లమెంట్లో మన ఎంపీలు ఉంటే..
ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ, లోక్‌సభలో బీఆర్ఎస్ ప్రతినిధులు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ అన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను ఉద్దేశించి మాట్లాడుతూ, “ఆయన ఒక పెద్ద వెధవ.. తెలంగాణ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే అడ్డుకునే నాథుడే లేడు. అదే మన ఎంపీలు ఉండి ఉంటే అక్కడ రణరంగం సృష్టించేవాళ్లు” అని వ్యాఖ్యానించారు.
* గత రాజకీయాలపై స్పష్టత…
2009లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వెనుక ఉన్న వ్యూహాన్ని కేసీఆర్ వివరించారు. చంద్రబాబు నాయుడు చేత ‘జై తెలంగాణ’ అనిపించేందుకే ఆనాడు పొత్తుకు మొగ్గు చూపినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో అవమానాలను, మానసిక క్షోభను భరించామని, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాల పట్ల బీఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధి మరే పార్టీకి ఉండదని ఆయన స్పష్టం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
