Venugopala Swamy festival Ippagudem
* 29న గరుడ ముద్ద
* 30న కళ్యాణ మహోత్సవం
* మే 1న బండ్లు తిరుగుట
* మే 2న ఉత్సవమూర్తుల శోభాయాత్ర
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం(శ్రీ మదనాపురం)లో శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవాలు ఈనెల 29, 30 మే నెల 1, 2వ తేదీలలో జరగనున్నట్లు జాతర కమిటీ తెలిపింది. వైశాఖ శుక్ల త్రయోదశి 29 బుధవారం గరుడ ముద్ద, వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం 30న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం. వైశాఖ పౌర్ణమి మే 1వ తేదీ శుక్రవారం బండ్లు తిరుగుట, వైశాఖ బహుళ పాడ్యమి 2వ తేదీ శనివారం పురవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపు(శోభాయాత్ర) నిర్వహించనున్నట్లు జాతర కమిటీ తెలిపింది. నాలుగు రోజులపాటు నిర్వహించే శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు గ్రామస్తులంతా సహకరించాలని ఉత్సవ కమిటీ కోరింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
