గొర్రెల స్కాం కేసులో ఏసీబీ అధికారులు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు
* దళారుల ప్రమేయంపై ఆరా
* తొలిరోజు నోరు మెదపని రాంచందర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దాదాపు 700 కోట్ల విలువైన గొర్రెల స్కాం (Sheep Scam) కేసులో ఏసీబీ అధికారులు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. మాజీ పశు సంవర్ధక శాఖ ఎండీ రాంచందర్ నాయక్(Ramchander Naik), తలసాని ఓఎస్డీ కళ్యాణ్ (Kalyan) లను ఇప్పటికే కస్టడీకి తీసుకుని ఓ దఫా విచారణ చేపట్టారు. నేడు కూడా విచారణను కొనసాగిస్తున్నారు. ఈ స్కామ్‌లో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించి పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గొర్రెల స్కామ్‌లో మొదట రూ. 2.10 కోట్లు దారి మళ్ళినట్టు గుర్తించారు. రూ.700 కోట్లకు సంబంధించి కూడా కీలక ఆధారాలు సేకరించారు. మొదటిరోజు సోమవారం కస్టడీ విచారణలో రామచందర్.. నోరు మెదపలేదని తెలిసింది. అలాగే ఓఎస్డీ కళ్యాణ్ కూడా విచారణకు సహకరించలేదు. గొర్రెల స్కీము యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఎవరి ప్రమేయంతో దళారి, భోగస్ కంపెనీతో గొర్రెలను రైతులకు కొనుగోలు చేసి ఇవ్వాలని ఆదేశించారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. రామచందర్, కళ్యాణ్‌లను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఈరోజు కస్టడీ విచారణలో రాజకీయ నాయకుల పాత్ర, ఓఎస్డీ కళ్యాణ్ ఫైల్స్ తరలింపు, కాల్చివేత వీటన్నింటిపై ఏసీబీ అరా తీస్తోంది.
———————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
