Telangana 27 deputy collectors transfers
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగంలో భారీ మార్పులు చేపట్టింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 మంది అడిషనల్ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు మరియు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పాలనను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ జి.ఓ.ఆర్.టి. నంబర్ 240 ద్వారా ఉత్తర్వులు విడుదల చేశారు. బదిలీ అయిన వారిలో అనేక జిల్లాల రెవెన్యూ అధికారులు (DRO) మరియు ఆర్డీవోలు (RDO) ఉన్నారు.
* బదిలీ అయిన అధికారులు – కొత్త పోస్టింగ్ వివరాలు
బి. హరి సింగ్ – అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), సూర్యాపేట
ఆర్.డి. మాధురి – స్పెషల్ కలెక్టర్, I&CAD, నల్గొండ
డి. రాజ్య లక్ష్మి – అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), పెద్దపల్లి
చ. మధు మోహన్ – అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), గద్వాల్
టి.ఎల్. సంగీత – అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), సంగారెడ్డి
వి. హనుమ నాయక్ – స్పెషల్ కలెక్టర్, I&CAD, వరంగల్
ఎం. సూర్య ప్రకాష్ – డిఆర్ఓ (DRO), వనపర్తి
చ. వెంకటేశ్వర్లు – డిఆర్ఓ (DRO), జనగామ
బి. వసంత కుమారి – డిఆర్ఓ (DRO), భూపాలపల్లి
ఎస్. పద్మావతి – డిఆర్ఓ (DRO), భద్రాద్రి కొత్తగూడెం
వి. రామ దేవి – డిఆర్ఓ (DRO), సిరిసిల్ల
జుబేదున్నిసా బేగం – డిఆర్ఓ (DRO), మహబూబాబాద్
డి. వేణు – డిఆర్ఓ (DRO), ఆసిఫాబాద్
బి. స్రవంతి – డిఆర్ఓ (DRO), ఆదిలాబాద్
ఎస్. రాజేశ్వరి – డిఆర్ఓ (DRO), నారాయణపేట
కె. శ్రీనివాస్ – డిఆర్ఓ (DRO), హనుమకొండ
ఎల్. రమేష్ – ఆర్డీవో (RDO), నారాయణపేట
రవీందర్ రెడ్డి అడ్ల – ఆర్డీవో (RDO), బాన్సువాడ
బి. గీత – డిఆర్ఓ (DRO), నిజామాబాద్
జి. అంబాదాస్ రాజేశ్వర్ – డిఆర్ఓ (DRO), మెదక్
ఎం. షర్మిల – ఆర్డీవో (RDO), ఉట్నూర్
ఎం. విజయ కుమారి – ఆర్డీవో (RDO), బోధన్
ఎస్. రమణ రెడ్డి – ఆర్డీవో (RDO), మిర్యాలగూడ
దోనకంటి రవీందర్ – ఆర్డీవో (RDO), కాటారం
ఎన్. రాజేందర్ రెడ్డి – ఆర్డీవో (RDO), సిరిసిల్ల
కె.ఎస్.బి. కుమారి – ఆర్డీవో (RDO), వేములవాడ
పి. పద్మ ప్రియ – ఆర్డీవో (RDO), దేవరకొండ
వీరితో పాటు శ్రీమతి ఆర్.వి. రాధా బాయిని తదుపరి పోస్టింగ్ కోసం రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. బదిలీ అయిన అధికారులందరూ వెంటనే తమకు కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
