Hanuman mala darulu biksha Chilpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం సామూహిక బిక్ష (అన్నదాన వితరణ) చేశారు. మండలంలోని పల్లగుట్ట, కొండాపూర్, చిల్పూర్, వెంకటాద్రి పేట, రాజవరం, కృష్ణాజిగూడ, ఫతేపూర్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది హనుమాన్ మాలదారులు ఈ సామూహిక బిక్షలో పాల్గొన్నారు. చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు అన్నదాన వితరణ(బిక్ష) ఏర్పాటు చేయించారు. మండల కేంద్రంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక పూజలు, ఆంజనేయ స్వామి భజన అనంతరం బిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. గురు స్వామి యనమల వెంకటస్వామి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది ఆంజనేయ స్వామి మాలదారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం డైరెక్టర్లు వేముల వెంకటేశ్వర్లు, రమేష్, రమేష్ రెడ్డి నాయకులు మనోజ్ అశోక్ పాల్, చెక్కరాజు తదితరులు పాల్గొన్నారు.
